In Christian communities, Bible study is the study of the Bible by ordinary people as a personal religious or spiritual practice. |
క్రైస్తవ సమాజములలో, బైబిలు అధ్యయనము సామాన్య ప్రజలు తమ వ్యక్తిగత మతపరమైన లేక ఆధ్యాత్మిక అభ్యాసము కొరకు చేయు బైబిలు అధ్యయనమైయున్నది. |
Some denominations may call this devotion or devotional acts; however in other denominations devotion has other meanings. |
కొన్ని డినామినేషన్లు దీనిని భక్తి లేక భక్తిసంబంధమైన క్రియలు అని పిలువవచ్చు; అయితే ఇతర డినామినేషన్లలో భక్తి అను పదమునకు ఇతర అర్థములు ఉన్నాయి. |
Bible study in this sense is distinct from biblical studies, which is a formal academic discipline. |
ఈ భావనలో బైబిలు అధ్యయనము అధికారిక అధ్యయన విభాగమైన బైబిలు అధ్యయనములకు భిన్నముగా ఉన్నది. |
In Evangelical Protestantism, the time set aside to engage in personal Bible study and prayer is sometimes informally called a Quiet Time. |
ఇవాంజెలికల్ ప్రొటెస్టెంట్ వాదములో, వ్యక్తిగత బైబిలు అధ్యయనము మరియు ప్రార్థన కొరకు కేటాయించబడు సమయమును అనధికారికముగా కొన్నిసార్లు నిశ్శబ్ద సమయము అని కూడా పిలుస్తారు. |
In other traditions personal Bible study is referred to as "devotions". |
ఇతర సంప్రదాయములలో వ్యక్తిగత బైబిలు అధ్యయనమును "ధ్యానములు" అని సంబోధిస్తారు. |
Catholic devotions and Anglican devotions both employ the Lectio Divina method of Bible reading. |
కాథలిక్ ధ్యానములు మరియు ఆంగ్లికన్ ధ్యానములు రెండూ బైబిలు అధ్యయనము యొక్క లెక్టియో డివిన పద్ధతిని ఉపయోగిస్తాయి. |
Christians of all denominations may use Study Bibles and Bible Reading notes to assist them in their personal Bible studies. |
అన్ని డినామినేషన్లకు చెందిన క్రైస్తవులు తమ వ్యక్తిగత బైబిలు అధ్యయనములలో సహకరించుట కొరకు అధ్యయన బైబిళ్లను మరియు బైబిలు రీడింగ్ నోట్స్ ను ఉపయోగిస్తారు. |
However, the use of such aids is discouraged in many churches, which advocate the simple reading of Bible passages. |
అయితే, బైబిలు భాగములను సరళమైన రీతిలో చదువుటను మాత్రమే ప్రతిపాదించు అనేక సంఘములు ఇట్టి వనరులను ప్రోత్సహించవు. |
In some cases, the practice of reading through the entire Bible in a year is followed, this usually requires readings each day from both the Old and New Testament. |
కొన్ని సందర్భాలలో, సంవత్సరానికి ఒకసారి బైబిలు అంతటిని చదువు ఆచారమును అనుసరించుట జరుగుతుంది, మరియు ఇలా చేయుట కొరకు ప్రతి రోజు పాత మరియు క్రొత్త నిబంధనలలోని కొంత భాగమును చదవవలసియుంటుంది. |
This practice, however, has been widely criticised on the basis that the understanding gained of each specific passage is too vague. |
అయితే ఇలా చేయుట ద్వారా వాక్యభాగములను గూర్చిన అవగాహన పెద్దగా కలుగదు అని ఈ ఆచారము బహుగా విమర్శించబడింది. |
The association of Bible study and prayer is an important one. |
బైబిలు అధ్యయనము మరియు ప్రార్థన మధ్య ఉన్న సంబంధము చాలా ప్రాముఖ్యమైనది. |
Christians do not merely study the Bible as an academic discipline, but with the desire to know God better. |
క్రైస్తవులు బైబిలును ఒక అధ్యయన విభాగముగా మాత్రమే చదవరుగాని, దేవుని మరిఉత్తమమైన రీతిలో తెలుసుకొనుటకు చదువుతారు. |
Therefore, they frequently pray that God will give them understanding of the passage being studied. |
కాబట్టి, వారు చదువు వాక్యభాగమును గూర్చి దేవుడు అవగాహనను అనుగ్రహించునట్లు వారు తరచుగా ప్రార్థిస్తారు. |
They also consider it necessary to consider what they read with an attitude of respect, rather than the critical attitude which is frequently followed in formal study. |
అంతేగాక అధికారిక అధ్యయనములో తరచుగా అనుసరించు విమర్శనాత్మక ధోరణితో గాక, గౌరవముతో కూడిన వైఖరితో వారు చదువు విషయములను పరిగణించుట చాలా అవసరమని వారు భావిస్తారు. |
To them, the Bible is not just a sacred book, but is the very Word of God, that is, a message from God which has direct relevance to their daily lives. |
బైబిలు కేవలం ఒక పవిత్రమైన పుస్తకము మాత్రమేగాక, స్వయంగా దేవుని వాక్యమైయున్నది అని, అనగా తమ అనుదిన జీవితములకు సూటిగా ఔచిత్యమైన దేవుని సందేశమైయున్నది అని వారు నమ్ముతారు. |