Atoms, the smallest particles of matter that retain the properties of the matter, are made of protons, electrons, and neutrons. |
పరమాణువులు అనేవి పదార్థం యొక్క అతి చిన్న కణాలు, ఇవి పదార్థం యొక్క ధర్మాలను కలిగి ఉంటాయి, ఇవి ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, మరియు న్యూట్రాన్ లతో ఏర్పడుతాయి. |
Protons have a positive charge, Electrons have a negative charge that cancels the proton's positive charge. |
ప్రోటాన్లు ధనావేశాన్ని కలిగి ఉంటాయి, ఎలక్ట్రాన్స్ రుణావేశాన్ని కలిగి ఉండి ఇవి ప్రోటాన్ యొక్క ధనావేశాన్ని రద్దు చేస్తాయి. |
Neutrons are particles that are similar to a proton but have a neutral charge. |
న్యూట్రాన్స్ అనేవి ప్రోటాన్ వంటి కణాలే కాని తటస్థ ఆవేశాన్ని కలిగి ఉంటాయి. |
There are no differences between positive and negative charges except that particles with the same charge repel each other and particles with opposite charges attract each other. |
ఒకే ఆవేశం గల కణాలు పరస్పరం వికర్షించుకోవడం మరియు వ్యతిరేేఖ ఆవేశం గల కణాలు పరస్పరం ఆకర్షించుకోవడం మినహా ధనావేశం మరియు రుణావేశాల మధ్య ఎలాంటి వ్యత్యాసాలు ఉండవు. |
If a solitary positive proton and negative electron are placed near each other they will come together to form a hydrogen atom. |
ఒకవేళ ఒక ఒంటరి ధనావేశ ప్రోటాన్ మరియు రుణావేశ ఎలక్ట్రాన్ ను పరస్పరం సమీపంగా ఉంచినప్పుడు అవి కలిసిపోయి హైడ్రోజన్ పరమాణువును ఏర్పరుస్తాయి. |
This repulsion and attraction (force between stationary charged particles) is known as the Electrostatic Force and extends theoretically to infinity, but is diluted as the distance between particles increases. |
ఈ వికర్షణ మరియు ఆకర్షణ (స్థిరమైన ఆవేశం గల కణాల మధ్య బలం) ను ఎలక్ట్రోస్టాటిక్ బలం అంటాము మరియు సిద్ధాంతపరంగా అనంతం వరకు విస్తరించును, కాని కణాల మధ్య దూరం పెరిగే కొద్ది ఈ బలం తగ్గిపోతుంది. |
When an atom has one or more missing electrons it is left with a positive charge, and when an atom has at least one extra electron it has a negative charge. |
ఒకటి లేదా ఎక్కువ ఎలక్ట్రాన్ లను కోల్పోయిన పరమాణువు ధనావేశాన్ని పొందుతుంది, మరియు కనీసం ఒక ఎలక్ట్రాన్ అదనంగా ఉన్న పరమాణువు రుణావేశాన్ని కలిగి ఉంటుంది. |
Having a positive or a negative charge makes an atom an ion. |
ధనావేశం లేదా రుణావేశం కలిగి ఉండడం పరమాణువును అయాన్ గా చేస్తుంది. |
Atoms only gain and lose protons and neutrons through fusion, fission, and radioactive decay. |
పరమాణువులు విచ్ఛిత్తి, సంలీనం, మరియు రేడియోధార్మిక క్షయం ద్వారా మాత్రమే ప్రోటాన్స్ మరియు న్యూట్రాన్స్ ను పొందడం మరియు కోల్పోవడం జరుగుతుంది. |
Although atoms are made of many particles and objects are made of many atoms, they behave similarly to charged particles in terms of how they repel and attract. |
పరమాణువులు అనేక కణాల కలయికతో ఏర్పడినప్పటికీ మరియు వస్తువులు అనేక పరమాణువులతో ఏర్పడినప్పటికీ, అవి ఎలా వికర్షించబడుతాయి మరియు ఆకర్షించబడుతాయనే విషయంగా అవి ఆవేశపూరిత కణాల లాగే ప్రవర్తిస్తాయి. |
In an atom the protons and neutrons combine to form a tightly bound nucleus. |
ఒక పరమాణువులో ప్రోటాన్స్ మరియు న్యూట్రాన్స్ కలిసిపోయి బలంగా బంధితమైన కేంద్రకాన్ని ఏర్పరుస్తాయి. |
This nucleus is surrounded by a vast cloud of electrons circling it at a distance but held near the protons by electromagnetic attraction (the electrostatic force discussed earlier). |
ఈ కేంద్రకం చుట్టూ విశాలమైన ఎలక్ట్రాన్ మేఘం ఆవరించబడి ఉంటుంది కాని విద్యుదయస్కాంత ఆకర్షణ (ఇంతకుముందు చర్చించిన ఎలక్ట్రోస్టాటిక్ బలం) ద్వారా ప్రోటాన్లకు దగ్గరగా ఉంచబడును. |
The cloud exists as a series of overlapping shells / bands in which the inner valence bands are filled with electrons and are tightly bound to the atom. |
మేఘం అనేది అతిపాతం చెందే షెల్స్ / పట్టీల శ్రేణిగా ఉంటుంది, దాని లోపలి వాలెన్స్ పట్టీలు ఎలక్ట్రాన్ లతో నిండి ఉంటాయి మరియు పరమాణువుతో గట్టిగా బంధింపబడి ఉంటాయి. |
The outer conduction bands contain no electrons except those that have accelerated to the conduction bands by gaining energy. |
శక్తిని పొందడం కోసం వాహక పట్టీలకు యాక్సిలరేట్ చేయబడినవి మినహాబయటి వాహక పట్టీలు ఎలక్ట్రాన్ లను కలిగి ఉండవు. |
With enough energy an electron will escape an atom (compare with the escape velocity of a space rocket). |
సరిపడా శక్తితో ఒక ఎలక్ట్రాన్ పరమాణువు నుండి తప్పించుకుని పోతుంది (స్పేస్ రాకెట్ యొక్క పలాయన వేగంతో పోల్చినప్పుడు) |
When an electron in the conduction band decelerates and falls to another conduction band or the valence band a photon is emitted. |
ఒక వహన పట్టీలోని ఎలక్ట్రాన్ శక్తిని కోల్పోయినప్పుడు మరో వహన పట్టీ లేదా వేలన్సీ పట్టీలోకి చేరినప్పుడు ఒక ఫోటాన్ ఉద్గారమవుతుంది. |
This is known as the photoelectric effect. |
దీనిని ఫోటోఎలక్ట్రిక్ ప్రభావం అంటాము. |