Art is a diverse range of human activities in creating visual, auditory or performing artifacts (artworks), expressing the author's imaginative or technical skill, intended to be appreciated for their beauty or emotional power. |
మనిషి వైవిధ్యభరిత కార్యకలాపాల్లో కళ ఒకటి. దృశ్య, శ్రవణ లేదా కళాకృతులను సృష్టిస్తుంది. తద్వారా సృజనకారుడి ఊహాత్మక లేదా సాంకేతిక నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ వాటి ఉద్వేగపరమైన శక్తిని లేదా అందాన్ని అభినందించే ప్రక్రియగా ఉంటుంది. |
In their most general form these activities include the production of works of art, the criticism of art, the study of the history of art, and the aesthetic dissemination of art. |
ఈ కార్యకలాపాల సాధారణ రూపంలో కళాకృతుల తయారీ, కళా విమర్శ, కళా చరిత్ర అధ్యయనం, కళా వ్యాప్తికి చెందిన అభిరుచులు ఇమిడి ఉంటాయి. |
The oldest documented forms of art are visual arts, which include creation of images or objects in fields including today painting, sculpture, printmaking, photography, and other visual media. |
పురాతన కళా రూపాల్లో దృశ్య రూపాలు ఉండేవి. అందులో చిత్రాలను రూపొందించడం లేదా ఇవాళ కనిపించే చిత్రలేఖన, శిల్పం, ముద్రణ, ఛాయాచిత్రాలు, ఇతర దృశ్య, శ్రవణ రూపాలుంటాయి. |
Music, theatre, film, dance, and other performing arts, as well as literature and other media such as interactive media, are included in a broader definition of art or the arts. |
సంగీతం, నాటక, సినిమా, నృత్యం ఇతర ప్రదర్శన కళలతో పాటు సాహిత్యం, పరస్పర ప్రభావిత మాధ్యమాలు వంటి మాద్యం వంటివి కళలు లేదా కళ విస్తృత నిర్వచనంలో ఇమిడి ఉంటాయి. |
In modern usage after the 17th century, where aesthetic considerations are paramount, the fine arts are separated and distinguished from acquired skills in general, such as the decorative or applied arts. |
17వ శతాబ్ది తరువాత ఆధునిక వాడకంలో అభిరుచిపరమైన పరిశీలనలకు అమిత ప్రాధాన్యత దక్కింది. అనువర్తిత, అలంకృత కళలు వంటి వాటి నుంచి లలిత కళలను, సాధారణ విభాగాల్లో సాధించిన నైపుణ్యాల నుంచి విస్పష్టంగా లలిత కళలను విడదీయడం జరిగింది. |
Art may be characterized in terms of mimesis (its representation of reality), narrative (storytelling), expression, communication of emotion, or other qualities. |
వాస్తవిక ప్రపంచాన్ని అనుకరించడమే కళా లక్షణంగా (వాస్తవిక ప్రతిబింబం మాత్రమే), వర్ణన (కథలు చెప్పడం), వ్యక్తీకరణ, ఉద్వేగాలను అందచేయడం లేదా ఇతర గుణాలుగా చెప్పవచ్చను. |
The nature of art and related concepts, such as creativity and interpretation, are explored in a branch of philosophy known as aesthetics. |
కళా స్వభావం మరియు తత్సంబంధిత భావనలు, అంటే సృజన మరియు వివరణ, అభిరుచులుగా తెలిసిన తాత్విక విభాగంలో శోధించబడతాయి. |